![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -467 లో.....శౌర్య నీ కన్నకూతురు కాకున్నా అన్ని బాగా చేస్తున్నావని జ్యోత్స్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ జ్యోత్స్న నీకేం అర్హత ఉందని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావని తనపై దశరథ్ కోప్పడతాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని ఇక్కడ ఒక్కరిచేత అనిపించమని జ్యోత్స్న అనగానే నువ్వు మాట్లాడింది తప్పు అని పారిజాతం అంటుంది. నీకు రక్తబంధం గురించి ఏం తెలుసు.. కొంతమంది పెంచుకున్న కూడా కన్నవాళ్లకంటే ఎక్కువ చూసుకుంటారని జ్యోత్స్నకి పారిజాతం కౌంటర్ వేస్తుంది.
గ్రానీ ఏంటి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఇక వెళదామా అని జ్యోత్స్న అనగానే ప్రాణధాతని చూడాలి కదా అని సుమిత్ర అంటుంది. కార్తీక్.. నీ ప్రాణధాతని పిలువమని సుమిత్ర అనగానే నువ్వు కళ్ళు మూసుకోమని కార్తీక్ చెప్తాడు. దీప ని తీసుకొని వెళ్లి సుమిత్ర ముందు నిల్చోబెడతాడు. తనని చూసి అందరు షాక్ అవుతారు. దీపనే నా ప్రాణధాత అని కార్తీక్ అనగానే లేదు తనని నా దృష్టిలో గొప్పగా చెయ్యడానికి అబద్దం చెప్తున్నావ్ అంటుంది. దాంతో కార్తీక్.. దీప చిన్నప్పటి ఫోటో చూపిస్తాడు. ఈ అమ్మాయే నిన్ను కాపాడిందని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత దీప, కుబేర్ తో ఉన్న ఫోటో చుపిస్తాడు కార్తీక్. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని కార్తీక్ అంటాడు. అవును అది చిన్నప్పటి ఫోటో దీపదే అని అనసూయ అంటుంది. దాంతో అందరు దీపనే కార్తీక్ ప్రాణధాత అని నమ్ముతారు.
దాంతో సుమిత్ర ఇబ్బందిగానే దీప కి థాంక్స్ చెప్పి లాకెట్ దీప మెడలో వేస్తుంది. ఆ తర్వాత ఇక వెళదామని సుమిత్ర అంటుంటే.. నాకు ఇంకో హెల్ప్ చెయ్యాలి నువ్వు దీపని క్షమించాలి.. మావయ్య నువ్వు అత్తని క్షమించాలి.. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |